బాబు దళిత వ్యతిరేకి: బద్వేలు ఎమ్మెల్లె

వైఎస్‌ఆర్‌జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేకి అని బద్వేలు శాసనసభ్యులు జయరాములు ఆరోపించారు. కడప నగరంలోని కళాక్షేత్రంలో జరిగిన ఎంఈఎఫ్ జిల్లా సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జయరాములు మాట్లాడుతూ చంద్రబాబు దళిత వ్యతిరేకి అని తెలిపారు. తాను ఎస్సీ వర్గీకరణ జరగాలని ఆశిస్తున్నానన్నారు. ఇందుకోసం వైఎస్సార్‌సీపీ తరఫున పోరాటం చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన హామీలను విస్మరించడం బాబు ఆనవాయితీగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు వర్గీకరణ చేస్తానని ఇప్పడు మాటమార్చడం చంద్రబాబుకు తగదని ఎమ్మార్పీస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కేసీ లక్ష్మయ్య అన్నారు. మాదిగలు కన్నెర్ర జేస్తే టీడీపీ పతనం తప్పదని హెచ్చరించారు.
Back to Top