ప్రతిపక్షంపై ఎదురుదాడే లక్ష్యంగా మహానాడు


– బాబు ట్రాప్‌లో పడి జేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
 – ఏ అర్హత ఉందని వైయస్‌ కుటుంబం గురించి మాట్లాడుతున్నావ్‌?
– వైయస్‌ఆర్‌ దయవల్ల జేసీ మంత్రి అయ్యారు
– మహానాడులో టీడీపీ మేనిఫెస్టో గురించి ఒక్క నేత మాట్లాడటం లేదు
– రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు
– రమణదీక్షితులుపై సోమిరెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటు
– ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మనసు గెలిచిన వ్యక్తి వైయస్‌ జగన్‌

హైదరాబాద్‌: ప్రతిపక్షం మీద ఎదురుదాడే లక్ష్యంగా టీడీపీ మహానాడు నిర్వహించారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు.  సంస్కారం లేకుండా.. ప్రజలు ఏమనుకుంటారనే ఇంకింతం లేకుండా చేసిన విమర్శలు సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉందన్నారు. మా నాయకుడికి సంస్కారం ఉంది కాబట్టే మా నోర్లు కట్టుకున్నామని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీకాంత్‌రెడ్డి మాటల్లోనే.. జానివాకర్‌రెడ్డి తాను మాట్లాడిన భాష, వింటూ ఆనందిస్తున్న చంద్రబాబును సంస్కారం లేని వ్యక్తులు ఇలా ఉంటారని నిరూపణ చేశారు. రాజనర్తకి ఏ రాజు అధికారంలో ఉంటే ఆ రాజు ముందు నృత్యాలు చేస్తారు.. అదే విధంగా దివాకర్‌రెడ్డి ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ ముఖ్యమంత్రికి అనుగుణంగా నాట్యం చేస్తుంటాడు. రాజనరక్తితో పోల్చవచ్చు. 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి రాబోయే తరాలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనే ఆలోచన లేకుండా వేదికలు ఎక్కినప్పుడు చంద్రబాబును సంతృప్తి పరచాలనే విధంగా మాట్లాడే భాషను ఆయన ఇంట్లోని కుటుంబసభ్యులు కూడా క్షమించరు.  వైయస్‌ జగన్, వైయస్‌ కుటుంబాన్ని తిడితే చంద్రబాబుకు ఆనందం. ఆ ఆనందాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశ్యంతో మాట్లాడడం.  జేసీ దివాకర్‌రెడ్డ ఒక్క నెంబర్‌ ప్లేట్‌తో 20 బస్సులు తిప్పుకోవాలి.. ప్రభుత్వం నుంచి తాడిపత్రిలో మాఫియా చేసుకోవాలి. తాడిపత్రిలో మర్డర్‌లు చేసుకోవాలి. వీరి వర్గం వ్యక్తులు పోలీసులపై దాడులు చేసినా వారిని కన్నెత్తి చూడని ప్రభుత్వం కావాలి. ఇటువంటి వ్యక్తులను చంద్రబాబు అడ్డుకాకూడదనే ఉద్దేశ్యంతో వైయస్‌ కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. ఏ అర్హత ఉంది జేసీ దివాకర్‌రెడ్డికి చెడబుట్టాడు. నిజంగా వైయస్‌ఆర్‌ సీపీలో వైయస్‌ జగన్‌ దగ్గర కూర్చున్నప్పుడు అభ్యంతర భాష మాట్లాడుతున్నారని చెబితే.. వాళ్ల మాదిరి మాట్లాడొద్దు, అన్నీ ప్రజలు గమనిస్తారని పెద్ద మనస్సుతో అంటూ, మానోర్లు కట్టేస్తున్నాడు. లేకపోతే మీ పురాణాలు బయటపెడితే రోడ్లమీద తిరగలేరు. 2004కు ముందు అనంతపురంలో రాజకీయాలు చేయలేక పారిపోయిన వ్యక్తి. మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడిన వ్యక్తివి నువ్వు. ఒక వ్యక్తి పేరు చెబితే చిన్నవేలు చూపించే పరిస్థితి. జిల్లా నుంచి పారిపోయావు. 
డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రజాభిమానం వల్ల 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యావు. ఆయన దయతో మంత్రిగా అయ్యావు. అయినా నీలో మార్పు రాలేదు. అందుకే రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదు వైయస్‌ఆర్‌. ఒంటరిగా ఉన్నప్పుడు మావోడివి.. ముఖ్యమంత్రివి కావాలని కౌగిలించుకుంటావు. బయటకు వచ్చి చంద్రబాబు మెప్పుకోసం మాట్లాడుతావు. సీనియర్‌ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబుకు ఎందుకు సిగ్గులేదో అర్థం కావడం లేదు. వేదికపై ఇలా మాట్లాడకూడదు అని అభ్యంతరం చెప్పే అనుభవం లేదా.. బెల్ట్‌షాపుల నుంచి తీసుకొచ్చి మాట్లాడేవాళ్లకు అభ్యంతరకర భాష రాకపోతే ఏది వస్తుంది. ఏ ఒక్కరైనా గుండెలపై చెయ్యి వేసుకొని మ్యానిఫెస్టోలో పెట్టినవన్నీ చేశామని చెప్పగలిగారా.. 
మ్యానిఫెస్టో అశ్లీల బుక్కు అన్నట్లుగా దాచిపెట్టారు. కేవలం రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు. సిగ్గుపడాలి. అనంతపురం జిల్లాలో రైతుకు ఎకరాకు లక్ష రూపాయల ఆదాయం వస్తుంది కోనసీమ అయిపోయిందని మాట్లాడుతున్నావు.. సిగ్గుందా.. రాయలసీమ ప్రజలు అల్లాడుతున్నారు. అనంతపురం జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎకరాకు లక్ష ఆదాయం వస్తుంటే.. వేల ఎకరాల పరిశ్రమల పేరుతో తీసుకుంటున్నారు.. రైతుకు ఎంత నష్టపరిహారం అందజేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించాలి. మాట్లాడిన ప్రతీ వ్యక్తి వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడుతున్నారు. ఇదేనా మహానాడు అంటే.. లక్షల కోట్లు దోచుకున్నారు. సభలకు, మీటింగ్‌లకు, రిపీటెడ్‌ వర్డ్స్‌ వినేందుకు ప్రభుత్వ సొమ్ము కోట్లు ఖర్చు చేస్తున్నారు. ధర్మపోరాట దీక్షఅని అబద్ధపు దీక్షకు వందల కోట్ల ప్రజల డబ్బు ఖర్చు చేస్తున్నారు.  ఊరికి ఒక కాన్వాయ్‌.. ప్రపంచంలో ఏ వ్యక్తికి లేని సెక్యూరిటీ పెట్టుకున్నావు. రోజుకు 4–5 కోట్లు సెక్యూరిటీకే ఖర్చు చేస్తున్నావు.  ఇంత ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ సిగ్గుపడకుండా దాడిచేసే విధానమా.. అనంతపురం జిల్లా కోనసీమ అయ్యిందంటున్నావు.. రా అక్కడే తిరుగుదాం.. ఎలా ఉందో.. చూద్దాం అమరావతిలో రూ. 50 వేల కోట్లు అప్పు చేస్తే.. అది తీర్చడానికి 20 సంవత్సరాలు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతీ రూపాయి అక్కడే ఖర్చు చేయాల్సి వస్తుంది మిగిలిన మా ప్రాంతాల పరిస్థితి ఏంటీ..? పవన్‌కల్యాణ్‌ ఒకప్పుడు వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడితే లైవ్‌లు పెట్టి కవరేజ్‌లు ఇచ్చేవారు.. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ వాస్తవాలు తెలుసుకొని బయటకువచ్చి మాట్లాడుతుంటే.. కవరేజీలు లేవు.. ఏందీ ద్వంద్వ నీతి సమయం వచ్చినప్పుడు సమస్యను తప్పుదోవపట్టించేందుకు మీ ఇష్టం వచ్చిన వ్యవహారాలు చేస్తారు.ఇదేనా మీ విధానం. టీబీపీ అని పెట్టుకోండి తెలుగు బూతుల పార్టీ అని పెట్టుకోండి. కులంపేర్లు ఎత్తి మాట్లాడుతున్నావు సిగ్గుండాలి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలోనే ..మా చెల్లెలు ఒక ఎస్సీని పెళ్లి చేసుకుంది అని చెప్పారు.  ఇటీవల వైయస్ జగన్ బహిరంగ మీటింగ్లో  ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వాళ్లను  మామా అని పిలిచేందుకు గర్వపడుతున్నా అని చెప్పారు.  మోత్కుపల్లి నర్సింహులు ఏ విధంగా మాట్లాడారో అర్థం చేసుకోండి..దివాకర్‌రెడ్డి, సోమిరెడ్డి కళ్లు తెరవకపోతే సర్వనాశనం అవుతారు.. ఏ విధంగా వాడుకుంటాడో.. మీరు తెలుసుకోండి. మీ క్యారెక్టర్‌ను చంపుకోకండి. వైయస్‌ జగన్‌ మొగాడు అని మీ పార్టీ నుంచి వచ్చిన వారు, రచయితలు, ప్రజలు అంటున్నారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మన్నలను పొందాడు, నువ్వు ఆ ప్రయత్నం చెయ్యి లోకేష్‌. వైయస్‌ జగన్‌కు ఆయన తాత బుద్ధులు వచ్చాయంటున్నారు. మరి లోకేష్‌కు ఎన్టీఆర్‌ బుద్ధులు వచ్చాయా.. బీజేపీకి ఓటేస్తే వైయస్‌ఆర్‌ సీపీకి ఓటేసినట్లేనని మాట్లాడుతున్నారు. బీజేపీతో వైయస్‌ఆర్‌ సీపీకి ఏం సంబంధం ఉంది. టీడీపీ ఎప్పుడైనా పొత్తులేకుండా పోటీ చేసిందా.. ఇప్పటి అధికారం కూడా బీజేపీతో కలిసి పోటీ చేసినందుకే అని ఆలోచించాలి. కళ్లు తెరుచుకొని ఆలోచన చెయ్యి చంద్రబాబు రాష్ట్ర పరిస్థితిని ఎంత దయనీయ స్థితికి తీసుకెళ్లావో.. 5 సంవత్సరాలు కావొస్తుంది... సింగపూర్, జపాన్, డల్లాస్, చైనా, రష్యా చేస్తానన్నావు. ఏదైనా ఒక్కటి చేశావా..  టెంపరరీ అసెంబ్లీ కట్టి రాజధాని నిర్మించానంటావా.. ప్రజలు అన్నీ ఆలోచన చేస్తారు. వైయస్‌ జగన్‌కు ఒక్క అవకాశం ఇస్తే పూర్తిగా అభివృద్ధి చేస్తారనే ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసే యత్నాలు ఎవరూ విశ్వసించరు. ఇప్పటికైనా సంస్కారంతో రాజకీయాలు చేసే పరిస్థితి తీసుకురండి.. నువ్వు చేసే మోసాలు.. రాజకీయాలు, అరాచకాలు మ్యానిప్యులేటర్‌ పొలిటీషన్‌గా పేరు సంపాదించుకున్నావు. నీ మోసాలను, అరాచకాలను వైయస్‌ జగన్‌ మాట్లాడుతున్నారు తప్ప వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడలేదు. మహానాడులో ఎన్టీఆర్‌ ఆఖరి వీడియో పెట్టి ఉంటే నీ గుణం బయటపడేది. 
 
Back to Top