అధికార పార్టీ నేతలకు తొత్తులుగా పోలీసులు


కర్నూలు: అధికార పార్టీ నేతలకు పోలీసులు తొత్తులుగా మారారని డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. శనివారం బుగ్గన ఆధ్వర్యంలో డోన్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. శాంతిభద్రతలు కాపాడాలంటూ పోలీసు స్టేషన్‌ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. అరాచక శక్తులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని బుగ్గన మండిపడ్డారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీఎం రౌడీయిజాన్ని, హత్యా రాజకీయాలను, భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. డోన్‌లో హత్యలు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఫైర్‌ అయ్యారు.
 
Back to Top