మొబైల్‌ ఫోన్‌ ద్వారా వైయస్ఆర్‌సీపీ సభ్యత్వం

హైదరాబాద్:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ సభ్యత్వ నమోదు‌ మరింత సులభం అయింది. పార్టీ సభ్యత్వ నమోదు కోసం ఐటీ విభాగం సరికొత్త ప్రక్రియ ప్రారంభించింది. వైయస్ఆర్‌సీపీలో చేరదలచుకున్న వారు ఇక నుంచి తమ మొబైల్ ఫో‌న్ నుంచి 88866 62266 నెంబ‌ర్‌కు ‘మిస్డు కాల్’ చేయడం ద్వారా గాని ఎస్‌ఎంఎస్ పం‌పించడం ద్వారా గానీ సభ్యత్వం పొందవచ్చని ఐటీ విభాగం కన్వీన‌ర్ చల్లా మధుసూదన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెంబరుకు మిస్డు కాల్ ఇస్తే సభ్యత్వ నమోదుకు సంబంధించిన వివరాలన్నీ ఎస్‌ఎంఎస్ ద్వారా.. కా‌ల్ వచ్చిన నెంబరుకు పంపుతారు. ఆ ఎస్‌ఎంఎ‌స్ ‌రిసీవ్‌ చేసుకున్న వ్యక్తి ఆ తరువాత 88866 67711 నెంబరుకు మళ్లీ తన వివరాలను పంపితే సభ్యత్వ నెంబర్‌ను కేటాయించడమే కాక, దానిని ధ్రువీకరిస్తూ ఒక సందేశం పంపుతారు. మిస్డు కాల్‌తో నిమిత్తం లేకుండా నేరుగా తమ పేరు, ఊరు పిన్‌కోడ్ వివరాలను 88866 67711 నెంబరుకు ఎస్‌ఎంఎ‌స్ పంపినా ‌వారి సభ్యత్వం నమోదవుతుందని మధుసూదన్‌రెడ్డి వివరించారు.

Back to Top