చెత్త బుట్టలు విరాళమిచ్చిన వైయస్సార్‌సీపీ నాయకులు

పుట్టపర్తి అర్బన్‌ : పెడపల్లి పంచాయతీలో ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్ట్‌ యార్డు కోసం ఇంటింటా చెత్తను సేకరించడానికి వీలుగా స్థానిక ఎస్సీ కాలనీవాసులకు వైయస్సార్‌సీపీ నాయకులు ఇంటికి రెండేసి బుట్టలను అందించారు. పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఉషారాణి, ఏడీసీసీ బ్యాంకు డైరెక్టర్‌ ఏవీ రమణారెడ్డి ఇంటికి రెండేసి బుట్టలను విరాళంగా అందించారు. గురువారం ఈఓపీఆర్డీ యోగానందరెడ్డి, సర్పంచ్‌ భారతమ్మ, మాజీ సర్పంచ్‌ చిత్తరంజన్‌రెడ్డి, కార్యదర్శి జితేంద్రనాయక్‌ తదితరులు కలసి స్థానిక ఎస్సీ కాలనీలో బుట్టలను పంపిణీ చేశారు. ఈసందర్బంగా అంబేడ్కర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ చెత్తను సేకరించి దాని నుంచి సంపద (ఎరువు, వానపాములు) తయారు చేస్తారన్నారు. చెత్తను వీధుల్లో పారబోయకుండా తీసుకున్న బుట్టల్లో తడి చెత్త, పొడి చెత్తను వేరుగా వేసి ఇంటింటికీ వచ్చే గ్రీన్‌ అంబాసిడర్లకు అందించాలన్నారు. దీంతో వీధులు సైతం శుభ్రంగా ఉంటాన్నారు. చెత్తతో తయారైన ఎరువును తక్కువ ధరలకే రైతులకు విక్రయిస్తారన్నారు. కార్యక్రమంలో నాగభూషణ, గ్రీన్‌ అంబాసిడర్లు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Back to Top