రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ బిందెలతో నిరసన

కరవుపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఖాళీ బిందెలతో వైఎస్సార్సీపీ నేతలు ధర్నా చేపట్టారు. కరవు, తాగునీటి ఎద్దడితో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎలుగెత్తి చాటారు. ప్రజాసమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. 

కృష్ణాః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడ ఆర్డీవో కార్యాలయం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. పామర్రులో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ వద్ద పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. విజయవాడలో గాంధీనగర్ ఎమ్మార్వో ఆఫీసు వద్ద పార్టీ నేతలు పార్థసారధి, గౌతంరెడ్డి, కార్పొరేటర్లు, కార్యకర్తలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. మైలవరంలో మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, పెడన, గూడూరులో ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.  

గుంటూరు: జిల్లాలోని మాచర్లలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి , స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్తో పాటు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు . ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నర్సారావుపేటలో, బాపట్ల మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కోన రఘుపతి ఆధ్వర్యంలో పార్టీనేతలు, కార్యకర్తలు ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. గురజాల ఎమ్మార్వో కార్యాలయం వద్ద జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పార్టీనేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. మంగళగిరిలో చేపట్టిన ధర్నాలో ఎమ్మెల్యే ఆర్కేతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


విశాఖపట్నంః మాడుగులలో ఎమ్మెల్యే ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో నాలుగు మండల కేంద్రాల్లో ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఖాలీ బిందెలతో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగారు. చోడవరంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో నాలుగు మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనకాపల్లిలో జానకీరామరాజు, సూరిబాబు ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు, ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. 

ప్రకాశంః మార్కాపురం ఆర్డీవో ఆఫీస్ వద్ద ఎమ్మెల్యే జంకె వెంకట్ రెండ్డి ఆధ్వర్యంలో మహిళలు, కార్యకర్తలు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. చీరాల ఎమ్మార్వో కార్యాలయం వద్ద యనం బాలాజి, దేశం బాబు ఆధ్వర్యంలో,  దర్శి ఎమ్మార్వో ఆఫీస్ వద్ద బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. కరువు, తాగునీటి సమస్యలపై అధికారులకు వినతిపత్రం సమర్పించారు. 

నెల్లూరు: కావలిలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు, నెల్లూరు జిల్లాలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్థన్రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

అనంతపురంః  జిల్లాలో 63 మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నేతల ధర్నా కార్యక్రమం కొనసాగుతోంది. అనంతపురం ఎమ్మార్వో కార్యాలయం వద్ద పార్టీ సీనియర్ నేతలు అనంత వెంకట్రాంరెడ్డి, గుర్నాథరెడ్డి ఆధ్వర్యంలో, కూడేరు ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో  కార్యకర్తలు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో, తాడిపత్రిలో రమేష్ రెడ్డి, రామిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా చేపట్టారు.  పెనుకొండ ఎమ్మార్వో ఆఫీస్ వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ ఆధ్వర్యంలో పెద్దఎత్తున వైఎస్సార్సీపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. 


వైఎస్సార్ జిల్లాః జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజంపేట ఎమ్మార్వో కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో, కమలాపురంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో, మైదుకూరు ఎమ్డీవో కార్యాలయం వద్ద ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో, జమ్మలమడుగు ఎమ్మార్వో ఆఫీస్ వద్ద పార్టీ నేత సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. కరవు, తాగునీటి ఎద్దడిని నివారించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నేతలు ఫైరయ్యారు. 

శ్రీకాకుళం: రాజాంలో ఎమ్మెల్యే కంబాల జోగులు, శ్రీకాకుళంలో జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, రణస్థలంలో గొర్లె కిరణ్కుమార్ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. 

విజయనగరం: జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నాయకుల నేతృత్వంలో తహశీల్దార్ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నెలిమర్లలోనూ పార్టీ ఆధ్వర్యంలో వెయ్యి మంది మహిళలు ఖాళీ బిందెలతో తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు సాంబశివరాజు పాల్గొన్నారు. సాలూరులో ఎమ్మెల్యే రాజన్నదొర ఆధ్వర్యంలో, కురుపాంలో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విజయనగరం మున్సిపల్ కార్యాలయం ఎదుట కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 

చిత్తూరుః తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి రూరల్ ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి  ఆధ్వర్వంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. బంగారుపాలెం ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో, పుంగనూరు ఎమ్మార్వో ఆఫీస్ వద్ద పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు.


తూర్పుగోదావరి: కొత్తపేటలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజమండ్రి రూరల్లో ఆకుల వీర్రాజు, జగ్గంపేటలో రఘురాం నేతృత్వంలో ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. పెద్దాపురం, సామర్లకోట, గోపవరం ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు.

పశ్చిమగోదావరి: పాలకొల్లు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఎమ్మెల్సీ శేషుబాబు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెనుగొండలో మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఆకివీడులో సుందరరామానాయుడు ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో ధర్నా కార్యక్రమాలు చేపట్టారు.

కర్నూలు: కల్లూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గౌరు చరిత ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బనగానపల్లె, పత్తికొండ, ఎమ్మిగనూరు ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట వైఎస్సార్సీపీ నాయకుల నేతృత్వంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. నందికొట్టూరులో ఎమ్మెల్యే ఐజయ్య ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Back to Top