టీడీపీ నేతలపై ప్రతిపక్షసభ్యుల ఫైర్..!

బ్రీఫుడ్ విత్ సీఎం బ్రీఫ్ కేసులు ఎక్కడినుంచి తెచ్చారో చెప్పండి...!

అధికారపార్టీ ఆగడాలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు.   తాము వాయిదాతీర్మానం ఇస్తే టీడీపీ నేతలు షాక్ కొట్టిన కాకుల్లా గగ్గోలు పెడుతున్నారని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోజా ధ్వజమెత్తారు. నోటీసు ఇస్తే ఎందుకు ఉలిక్కిపడుతున్నారని రోజా పాలకపక్షాన్ని ప్రశ్నించారు. తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఇది తెలంగాణ సంబంధించిన అంశమంటున్నారని, మరి అలాంటప్పుడు ఏపీ ప్రభుత్వం మత్తయ్యకు ఎందుకు రక్షణ కల్పించిందో చెప్పాలన్నారు.  పట్టిసీమ ప్రాజెక్ట్ లో దోచుకున్న డబ్బులతో ఎమ్మెల్సీలను కొనడానికి ప్రయత్నించారని రోజా  విమర్శించారు. బ్రీఫుడ్ విత్ సీఎం బ్రీఫ్ కేసులు ఎక్కడి నుంచి తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసు నుంచి తప్పించుకునేందుకు 15 సార్లు డీజీపీతో భేటీ అయిన చంద్రబాబు..రిషితేశ్వరి,వనజాక్షి కేసులో ఎన్నిసార్లు పోలీసులతో సమావేశమయ్యారో చెప్పాలన్నారు. 
Back to Top