వైయస్సార్సీపీ నేత ఆర్థిక సాయం

పామిడి: రోడ్డు ప్రమాదంలో రెండుకాళ్ళు విరిగి మంచానికే పరిమితమైన ఓ బాధితునికి ఆర్థికసాయం అందించి తన దాతృత్వాన్ని చాటాడు వైయస్సార్‌సీపీ నాయకుడు పెరుమాళ్ళ జీవానందరెడ్డి. వివరాలు ఇలా ఉన్నాయి. రోడ్డు ప్రమాదంలో స్థానిక వెంగమనాయుడు కాలనీకి చెందిన తిరుపాల్‌రెడ్డి రెండుకాళ్ళు విరిగిన విషయం పాఠకులకు తెలిసిందే. అప్పటి నుంచి తిరుపాల్‌రెడ్డి మంచానికే పరిమితమయ్యాడు. దీనికితోడు రెక్కాడితేగాని డొక్కాఢని కుటుంబం అవ్వడంతో వైద్యం చేయించుకోలేని దుర్భర ఆర్థిక పరిస్థితి అతనిది. ఈవిషయం తెలుసుకున్న వైయస్సార్‌సీపీనేత, సామాజిక కార్యకర్త పెరుమాళ్ళ జీవానందరెడ్డి స్పందించారు. బాధిత తిరుపాల్‌రెడ్డి వైద్యంకోసం రూ.5వేలు ఆర్థికసాయం అందించి ఆయన తన దాతృత్వాన్ని చాటారు. బాధిత కుటుంబసభ్యులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో నిర్వాహకులు పట్రాపుల్లయ్య, నక్కా రామకృష్ణ, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Back to Top