వైయస్సార్ కడప:ప్రత్యేకహోదా కోసం వైయస్సార్సీపీ గర్జిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరిని నిరసిస్తూ వైయస్సార్సీపీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు కొనసాగుతోంది. ఈ ఉదయం 5 గంటలకు కడప ఆర్టీసీ బస్ డిపో వద్ద ఆందోళన చేస్తున్న వైయస్‌ఆర్‌సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప నగర మేయర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు నిత్యానందరెడ్డితో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టుచేసి రిమ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.