టీడీపీ అవాస్తవాలను ప్రచారం చేస్తోంది..

హత్యయత్నంపై టీడీపీ పెద్దల ప్రోదల్భం ఉంది...
–వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి
ఢిల్లీః ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగినప్పటి నుంచి టీడీపీ తమ అనుకూల పచ్చమీడియా, సోషల్‌ మీడియా ద్వారా అవాస్తవాలను ప్రచారం చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో జాతీయ మీడియాతో ఆయన మాట్లాడారు. వైయస్‌ జగన్‌ను హత్య చేయడానికి టీడీపీ పెద్ద కుట్రకు పాల్పడిందని, ఈ కుట్రలో చంద్రబాబు,లోకేష్‌తో పాటు డీజీపీ కూడా ఉన్నారని ఆరోపించారు. ఘటనపై విచారణ కూడా జరపకుండా హత్యాయత్నం జరిగిన  గంటలోపే  డీజీపీ ప్రెస్‌మీట్‌ పెట్టి పచ్చచొక్కా వేసుకున్న టీడీపీ కార్యకర్తలా మాట్లాడటం వెనుక కుట్ర కోణం కనిపిస్తుందన్నారు.  వైయస్‌ఆర్‌సీపీ అభిమానే దాడికి చేశాడని, సానుభూతి కోసమే చేయించుకున్నారని, చిన్నగాయం అని తప్పదారి పట్టించే ప్రయత్నం చేశారన్నారు. అదే రోజు  సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు వెకిలిచేష్టలతో, ప్రతిపక్ష నేతపై కనీస గౌరవం లేకుండా హేళనగా మాట్లాడి తన స్థాయిని దిగజార్చుకున్నారన్నారు. వైయస్‌ జగన్‌తో  బీజేపీ,జనసేన పార్టీలు కలిసి పోయాయని మతిలేని వ్యాఖ్యలు చేశారన్నారు. గాయం కేవలం 0.5 సెంటీమీటర్లు మాత్రమే అయ్యిందని తçప్పుడు ప్రచారం చేశారని, ఎయిర్‌పోర్ట్‌లో  ఫస్ట్‌ ఎయిడ్‌ మాత్రమే చేశారని, కేవలం ప్రథమ చికిత్సలో గాయం కొలతలు ఎలా నిర్థారిస్తారని చంద్రబాబును తప్పబట్టారు. నిందితుడు శ్రీనివాస్‌పై ముమ్మిడివరంలో క్రిమినల్‌ కేసుతో పాటు అనేక కేసులు ఉన్నాయన్నారు. రిమాండ్‌ రిపోర్ట్‌లో  శ్రీనివాస్‌ గురించి సమాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్ట్‌లో పనిచేయాలంటే పోలీసులు విచారణ చేసి ఎన్‌వోసి సర్టిఫికెట్‌ ఇస్తారన్నారు. శ్రీనివాస్‌పై  క్రిమినల్‌ కేసులు ఉన్నప్పటికి ఎన్‌వోసి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఇందులో టీడీపీ పెద్ద తలకాయల హస్తం ఉందన్నారు.  ఎయిర్‌పోర్ట్‌  రెస్టారెంట్‌ యాజమానికి చంద్రబాబు,లోకేష్‌లతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.  వారిందరి ప్రోదల్భంతోనే నిందితుడు శ్రీనివాస్‌ వైయస్‌ జగన్‌ను హత్య చేయడానికి ప్రయత్నించాడన్నారు. ఘటన జరిగిన గంటకు రెస్టారెంట్‌ యాజమాని హరిశ్చంద్ర ప్రసాద్‌ ఇంటివద్ద పోలీసు రక్షణ కల్పించారని, ఇందంతా పథక రచన ప్రకారమే జరిగిందన్నడానికి నిదర్శనమన్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న  విచారణపై నమ్మకం లేదన్నారు.ప్రభుత్వ అధికారులు,పోలీసులు అండదండలతో మార్పింగ్‌ ప్లెక్సీలు స్పష్టించారన్నారు. ఈ కేసులో సీఎం,డిజీపీ స్థాయి నుంచి అందరి ప్రోదల్భం ఉందన్నారు.
కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు ఫిర్యాదు చేశామన్నారు.

తాజా వీడియోలు

Back to Top