పులివెందులకు కృష్ణా నీళ్లు తీసుకొచ్చిన ఘనత వైయస్‌ఆర్‌దే...

వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేస్తాం..
 వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపి అవినాష్‌ రెడ్డి
వైయస్‌ఆర్‌ జిల్లాః టీడీపీ పాలనలో ప్రజలకు ఎటువంటి మేలు జరగదలేదని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపి అవినాష్‌ రెడ్డి విమర్శించారు. పులివెందులలో పాదయాత్ర నిర్వహించి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులు అంతా తామే చేశామని  టీడీపీ  చెప్పుకుంటుందని,  వాస్తవాలు ప్రజలు గ్రహించాలని పేర్కొన్నారు. పులివెందులకు కృష్ణ జలాలు తీసుకొచ్చిన ఘనత దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని అన్నారు. తుంగభద్ర నుంచి నీళ్లు ఇవ్వాలంటే సరిపోవడంలేదని,  పులివెందుల సస్యశ్యామలం అవ్వలంటే ఒక తుంగభద్రతో సాధ్యం కాదని కృష్ణ జలాలను తీసుకురావడమే మార్గమని ఆలోచన చేసి ఆచరణలో పెట్టారన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పొత్తిరెడ్డి పాడు రెగ్యులేటరీని విస్తరించి ,11 వేల క్యూసెక్కుల నుంచి 44వేల క్యూసెక్కులకు పెంచారన్నారు. అఖిలపక్షం వేసి అందరిని ఒప్పించి సాధించారన్నారు. గాలినగరి, హంద్రీనీవా ప్రాజెక్టులకు ఎన్టీఆర్‌ శంకుస్థాపన చేశారని, అనంతరం  చంద్రబాబు హయాంలో ఒక పైసా కూడా ఖర్చుపెట్టలేదన్నారు.  వైయస్‌ఆర్‌ వచ్చాక 89 శాతం పూర్తిచేశారన్నారు. గండికోట, చిత్రవతి ఎత్తిపోతల పథకాలను వేల కోట్ల రూపాయలతో నిర్మించారన్నారు. సాగునీటి ప్రాజెక్టులను తీసుకొచ్చిన ఘనత ఒక్క వైయస్‌ఆర్‌దేనని అన్నారు. అలాగే ఉపాధి,అభివృద్ధితో పాటు ట్రిపుల్‌ ఐటి, సిన్పింగ్‌ మిల్లు,జెఎన్‌టియూ, గురుకుల పాఠశాలలు తీసుకురావడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఒక పరిశ్రమ కూడా రాలేదు,విద్యాసంస్థ కూడా రాలేదన్నారు. టీడీపీ నాయకులు పులివెందుల అభివృద్ధి మీద చర్చకు రమ్మంటున్నారని.. చర్చ అవసరం లేదు.అభివృద్ధికి సాక్షులు మీరే అంటూ ప్రజలనుద్దేశించి అన్నారు.  వైయస్‌ఆర్‌సీపీని అధికారంలోకి తీసుకొస్తే మిగిలిన పెండింగ్‌ పంటకాల్వలను పూర్తిచేస్తామన్నారు. మెక్రో ఇరిగేషన్‌ దివంగత మహానేత వైయస్‌ఆర్‌ కల అని దీని ద్వారా ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తామని తెలిపారు.
Back to Top