వైయ‌స్ఆర్‌సీపీలో చేర‌డం ఆనందంగా ఉంది


విశాఖ‌: ప‌్ర‌జ‌ల కోసం శ్ర‌మిస్తున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌డం ఆనందంగా ఉంద‌ని గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన విడదల రజనీ పేర్కొన్నారు. గురువారం ఆమె వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో  వేలాది మంది కార్యకర్తలతో క‌లిసి వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్ప‌డిన నాటి నుంచి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై అలుపెర‌గ‌ని పోరాటం చేస్తుంద‌న్నారు. కొత్త‌గా ఏర్ప‌డిన రాష్ట్రానికి విభ‌జ‌న చ‌ట్టంలోని హామీలు అమ‌లు చేయ‌డంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు విఫ‌లం కావ‌డంతో వాటి సాధ‌న‌కు నాలుగేళ్లుగా వైయ‌స్ జ‌గ‌న్ పోరాడుతున్న తీరు త‌న‌లో స్ఫూర్తిని పెంచింద‌న్నారు. గ‌తేడాది న‌వంబ‌ర్ నుంచి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చేప‌ట్టి ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉన్న ఏకైక నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్  ఒక్క‌రినే చూశాన‌ని, త‌ప్ప‌కుండా ఆయ‌న సీఎం అవుతార‌ని, ప్ర‌జ‌ల క‌ష్టాలు తొల‌గిపోతాయ‌ని చెప్పారు.  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజశేఖ‌ర‌రెడ్డి తర్వాత  ఏ నాయకుడికి దొరకని ప్రజల ప్రేమ, ఆదరణ వైయస్‌ జగన్‌కు లభిస్తున్నాయన్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేసేందుకు శాయ‌శ‌క్తుల కృషి చేస్తాన‌ని ర‌జ‌నీ పేర్కొన్నారు.
Back to Top