వైయస్‌ జగన్‌కు అత్యధిక భద్రత కల్పించాలి

వైయస్‌ జగన్‌కు అత్యధిక భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరినట్టు వైయస్‌ఆర్‌సీపీ తాజా మాజీ ఎంపీ వరప్రసాద్‌ తెలిపారు. రాజ్‌నాథ్‌తో బేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రిమాండు రిపోర్టులో హత్యాయత్నం జరిగిందని స్పష్టమైందన్నారు. చంద్రబాబు, డీజీపీ వ్యాఖ్యాలను రాజ్‌నాథ్‌ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను వైయ‌స్ఆర్‌ సీపీ  నేతల బృందం సోమ‌వారం ఉద‌యం కలిసింది. వైయ‌స్ఆర్‌ సీపీ  అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వినపత్రాన్ని ఆయనకు ఇచ్చారు. 
 

Back to Top