నాలుగేళ్ల త‌రువాత పేరూరు గుర్తుకొచ్చిందా బాబూ?


అనంత‌పురం:  నాలుగేళ్ల పాటు నోరు మెద‌ప‌కుండా ఉండి ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌ని ఇప్పుడు చంద్ర‌బాబు పేరూరు ప్రాజెక్టుకు శంకుస్థాప‌న చేసేందుకు వ‌స్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి మండిప‌డ్డారు. పేరూరు డ్యాంకు పైసా ఖ‌ర్చు లేకుండా హంద్రీనీవా నుంచి నీటిని ఇవ్వ‌వ‌చ్చు అని, అయితే మంత్రి ప‌రిటాల సునీత‌కు ల‌బ్ధి చేకూర్చేందుకు రూ.800 కోట్ల‌తో కొత్త ప‌నుల‌కు శ్రీ‌కారం చుడుతున్నార‌ని త‌ప్పుప‌ట్టారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో దోచుకోవ‌డం, దాచుకోవ‌డ‌మే టీడీపీ నాయ‌కులు ప‌నిగా పెట్టుకున్నార‌ని, రైతుల‌ను విస్మ‌రించిన టీడీపీ ప్ర‌భుత్వానికి త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని హెచ్చ‌రించారు. 

Back to Top