చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి...

శ్రీకాకుళం జిల్లాకు చంద్రబాబు చేసింది శూన్యం...
వైయస్‌ఆర్‌సీపీ సీఇసీ సభ్యుడు సూరిబాబు..
శ్రీకాకుళంః జిల్లాకు టీడీపీ ప్రభుత్వం చేసింది శూన్యమని వైయస్‌ఆర్‌సీపీ సీఇసీ సభ్యుడు అందవరపు సూరిబాబు మండిపడ్డారు.జిల్లాలో ఒక ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదన్నారు.చంద్రబాబు పట్ల ప్రజలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.శ్రీకాకుళం జిల్లాలో సగం  పాదయాత్ర పూర్తయిందని,వైయస్‌ జగన్‌కు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు.అన్నివర్గాల ప్రజలు జననేతకు మద్దతు తెల్పుతున్నారన్నారు. వైయస్‌ జగన్‌ అన్ని కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.  ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారించడానికి  జననేత అడుగులు వేస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలు అందరూ వైయస్‌ జగన్‌ వస్తేనే కష్టాలు తీరుతాయని భావిస్తున్నారన్నారు.మళ్లీ దివంగత వైయస్‌ఆర్‌ పాలన మళ్లీ వైయస్‌ జగన్‌ తీసుకుసువస్తారనే ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.
 


Back to Top