ఏపీకి పట్టిన శని చంద్రబాబు


విజయవాడ: చంద్రబాబు ఆంధ్రరాష్ట్రానికి పట్టిన శని అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌బాబు మండిపడ్డారు. చంద్రబాబు పూటకో మాట చెబుతూ అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఏపీ ప్రజల చెవ్వుల్లో పూలు పెడుతున్నారని, పెద్ద నోట్ల రద్దు తన ఘనతే అన్న చంద్రబాబు ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నారన్నారు. పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపు చంద్రబాబు చేసిన పాపమే అన్నారు. ఆయన చేసిన నెపాన్ని కేంద్రంపై నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 
 
Back to Top