బాబు పాలనకు చరమగీతం పాడే రోజులొచ్చాయి


 

గూడూరు: చ‌ంద్ర‌బాబు పాలనకు చరమగీతం పాడే రోజులొచ్చాయని  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు జిల్లా ఇన్‌చార్జ్‌ సజ్జల రామక్రిష్ణారెడ్డి అన్నారు. గూడూరు రూరల్‌ మండలం మంగళపూరు గ్రామంలో ఆదివారం రాత్రి వైయ‌స్ఆర్‌సీపీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..అన్ని సామాజికవర్గాల ప్రజలు బాబు పాలనను వ్యతిరేకిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 పార్లమెంట్‌ స్థానాల్లో పార్టీ విజయదుంధుబి మోగిస్తుందన్నారు. దీంతో ఢీల్లీలో కూడా వైయ‌స్ఆర్‌సీపీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్రంలోనే గూడూరు నియోజకవర్గానికి గౌరవప్రదమైన స్థానం ఉందని ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. వైయ‌స్ఆర్‌సీపీకి నెల్లూరు జిల్లా కంచుకోట అన్నారు. గూడూరులో పార్టీకి విధేయుడైన మేరిగ మురళీధర్‌ను సమన్వయకర్తగా ఏర్పాటు చేశామన్నారు.  తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి వల్లే సాధ్యమన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా జన్మభూమి కమిటీలను తెచ్చి కలెక్టరేట్లకు కూడా విలువ లేకుండా చేశారని దుయ్యబట్టారు.   దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి హయాంలో పేద, బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో భరోసా ఏర్పడిందని అన్నారు. ప్రజలను మోసం చేసిన వారిని విడిచిపెట్టకూడదన్నారు 

Back to Top