అవిశ్వాసానికి సంఘీభావంగా ప్రజాసంకల్ప మానవహారం

చర్చ జరిగే వరకు తగ్గేదే లేదు
వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
నెల్లూరు: ప్రత్యేక హోదాపై చర్చ జరిగేంత వరకు వెనక్కు తగ్గేదే లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... లోక్‌సభలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రెండోసారి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి సంఘీభావంగా ప్రజా సంకల్ప మానవహారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో జరుగుతుంది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు ప్రత్యేక హోదా పోరాటం ఆగదన్నారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాను సాధించేందుకు పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేశామని, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ నిరాహార దీక్ష సైతం చేపట్టారన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి హోదాపై చిత్తశుద్ధి లేదన్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో యూటర్న్‌ తీసుకొని ఇప్పుడు రంగు మార్చి హోదా అంటున్నారన్నారు. చంద్రబాబు నాలుగేళ్లుగా చేసిన దౌర్జన్యాలను ప్రజలంతా గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదన్నారు. 
Back to Top