అరకు: ఆంధ్రరాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ వ్యభిచారాలు చేస్తున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకులోయ సమన్వయకర్త చెట్టి పాల్గుణ మండిపడ్డారు. రాజకీయ బిక్షపెట్టిన వైయస్‌ఆర్ సీపీని వీడి పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి గిరిజనుల మనోభావాలను కించపరిచిందన్నారు. పార్టీలు మారేవారు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.