దుష్టపాలనలో ఒకేఒక ఆశాకిరణం వైయస్‌ జగన్‌..

మోసపూరిత వాగ్ధానాలతో అధికారం చేపట్టి, ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తున్న టీడీపీ ప్రభుత్వంపై ప్రజలకు ఏవగింపు కలుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ నేత మళ్ళా విజయప్రసాద్‌ తెలిపారు. చంద్రబాబు నయవంచక పాలనలో రాజన్న బిడ్డ జననేత జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలకు ఆశాకిరణంలా కనిపిస్తున్నారన్నారు. అందుకే ప్రజలు వైయస్‌ జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.మళ్లీ రాజన్న రాజ్యం వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే వస్తుందని ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తున్నారన్నారు. టీడీపీ పాలనలో ప్రజలు పూర్తిగా విసుగు చెంది ఉన్నారన్నారు.
Back to Top