కంచరపాలెం సభ గెలుపుకు నాంది

ఐదుకిలోమీటర్లు, ఆరు లైన్ల రోడ్డు ఎటు చూసినా జనమే
వైయస్‌ఆర్‌ సీపీ సమన్వయకర్త కేకే రాజు
విశాఖపట్నం: విశాఖ కంచరపాలెంలో జరిగిన బహిరంగ సభ రాబోయే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ గెలుపుకు నాంది అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త కేకే రాజు అన్నారు. కంచరపాలెం మెట్టు వద్ద జరిగిన సభ ఉత్తరాంధ్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బస శిబిరం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బహిరంగ సభకు ఐదు కిలోమీటర్ల మేర ఆరు లైన్ల రోడ్డు జనసందోహంతో నిండిపోయిందన్నారు. ఎటు చూసినా జనమే.. ఇసుక వేస్తే రాలనంత జనం సభకు తరలివచ్చారన్నారు. ఇది వైయస్‌ జగన్‌పై ఉన్న అభిమానమన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఇడుపులపాయ నుంచి వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర జిల్లా జిల్లాకు ప్రజల ఆదరాభిమానాలు పొందుతుందన్నారు. ప్రజలతో మమేకమవుతూ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారన్నారు. రెండు గంటల పాటు సాగిన వైయస్‌ జగన్‌ ప్రసంగం ప్రజలంతా అడుగు కూడా కదపకుండా విన్నారన్నారు. కంచరపాలెం బహిరంగ సభ రాజకీయాల్లో కొత్త మలుపు అన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ప్రజలంతా ఉన్నారన్నారు. 
 
Back to Top