<strong>సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసుల అత్యుత్సాహం</strong><strong>రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది..</strong><strong>వైయస్‌ఆర్‌సీపీ నేత కాపు రామచంద్రారెడ్డి.</strong>అనంతపురంః చంద్రబాబునాయుడు ఏ జిల్లాకు పర్యటనకు వెళ్ళిన టీడీపీ ప్రభుత్వానికి వైయస్‌ఆర్‌సీపీ నేతలను నిర్భందించడం అలవాటుగా మారిపోయింది.రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని చెప్పడానికి టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. అనంతపురంలో జిల్లాలో నేడు సిఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు,కార్యకర్తలను ముందుస్తుగా అరెస్ట్ చేశారు. రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు. కల్యాణదుర్గంలో సంయుక్త కార్యదర్శి కిష్టప్పసహా 10 మందిరి అరెస్ట్ చేయగా, అనంతపురంలో విద్యార్థి సంఘాల నేతలకు పోలీసుల నోటీసులు పంపించారు. ఈ సందర్భంగా రాయదుర్గంలో ప్రధాన సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి శాంతియుతంగా తీసుకెళ్లాడానికి సిద్ధపడితే టీడీపీ ప్రభుత్వం నిర్బంధచర్యలకు పాల్పడుతుందని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి నుంచి పోలీసులను మోహరించి వైయస్‌ఆర్‌సీపీ నేతలను యుద్ధఖైదీలా గృహ నిర్బంధన చేసి భయభ్రాంతులను గురిచేస్తున్నారన్నారు. అణచివేత ధోరణి ప్రభుత్వంలో కనబడుతుందన్నారు. ప్రజాస్వామ్య హక్కులను టీడీపీ కాలరాస్తుందని మండిపడ్డారు. ఎన్నికల హామీలు నెరవేర్చకపోవడంతో టీడీపీపై ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో పోలీసులను అడ్డంపెట్టుకుని సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారని మండిపడ్డారు.