టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలి


విశాఖ: ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని విశాఖ జిల్లా నాయకుడు గుడివాడ అమర్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం వైయస్‌జగన్‌ మొదటి నుంచి పోరాటం చేస్తున్నారని చెప్పారు. టీడీపీ నాయకులకు విలువలు లేవని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని, పార్లమెంట్‌ సమావేశాల చివరి రోజు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రత్యేక హోదాపై పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. 

 
Back to Top