చట్టాల ఉల్లంఘన చంద్రబాబు నైజం...

వ్యవస్థలను భ్రష్టు పట్టించడమే చంద్రబాబు నీతి..
సీబీఐ అంటే భయమెందుకు..
నిజాయతీ ఉంటే... నీ సచ్ఛీలతను నిరూపించుకో...
హైదరాబాద్ః సీబీఐ పేరు చెబితే చంద్రబాబు వణికిపోతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర దర్యాప్తు సంస్థను అనుమతి లేకుండా రాష్ట్రంలోకి ప్రవేశించకూడదని ఏపీ ప్రభుత్వం  నిర్ణయాన్ని తప్పబట్టారు.  నేర పరిశోధనకు ఏసీబీకి అనుకూలత స్పష్టించడం అశ్చర్యకరంగా ఉందన్నారు..చంద్రబాబు ఎప్పడూ చట్టాలను ఉల్లంఘిస్తారని విమర్శించారు. విచ్చలవిడిగా అప్పులు చేయకూడదనే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాలన్ని ఉల్లంఘించడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని సైతం చంద్రబాబు ఉల్లంఘించారని మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు సెక్షన్‌ 8ను ఉల్లంఘించారని విమర్శించారు. ఒకో వ్యవస్థకు ఒకో బాధ్యత ఉంటుందన్నారు. తప్పుల నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు  వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఒక నిర్ణయం వలన 63 కేంద్ర చట్టాలకు ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. 23 మంది వైయస్‌ఆర్‌సీపీ  ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి చట్ట ఉల్లంఘన చేశారన్నారు.  పుష్కరాలలో 29 మంది చనిపోతే కనీసం ఒక అధికారి, ప్రజాపత్రిని«ధిపైనా కూడా  చర్యలు తీసుకోలేదన్నారు. ప్రజల రక్షణను  బుడిదలో పోసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేంద్రంతో విభేదించిన తర్వాత ఎదో జరగబోతుందని ఎందుకు భయపడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు.. మీరు నిజాయతీగా ఉన్నప్పుడు సచ్చీలతను నిరూపించుకోవాలని  ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఏపీలో  ఐటిదాడులు జరిగితే అల్లరి అల్లరి చేశారని,. ఏ వ్యాపారస్తుడు, కా్రంటాక్టర్‌కు  రాజకీయ పార్టీ సంబంధం ఉంటే చెక్‌ చేయకూడదా అంటూ పశ్నించారు. రక్షణ కవచం కావాలా అన్ని ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌ హత్యాయత్నం కేసులో చంద్రబాబు భయపడుతున్నారని, 40 ఏళ్ల అనుభవం అంటూ పెట్టుకుని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే తప్పుడు చర్యలను ఉపసంహరించుకోవాలని  చట్టం తన పని చేసుకోవడానికి ఏపీలో సానుకూల వాతావరణం  కల్పించాలని కోరారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top