<br/><br/>గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజవేఖరరెడ్డి అత్యుత్తమ ముఖ్యమంత్రి అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ కొనియాడారు. ప్రభుత్వ పథకాలను సామాన్యులకు అందించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిదే అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. గుంటూరులో నిర్వహించిన బూత్ కమిటీ కన్వీనర్ల శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందిచిన ఘన త వైయస్‌ఆర్‌దే అన్నారు.