చంద్రబాబు ఆధునిక నియంతబాబును చూసి హిట్లరే సిగ్గుపడతాడుబంద్తో చంద్రబాబు దాష్టికరూపం బయటపడిందిహోదా పోరులో ప్రాణాలొదిలిన దుర్గారావుకు సంతాపంచంద్రబాబును ఎంత నీచంగా మాట్లాడినా తక్కువే..చెక్కుచెదరని మనస్తత్వం కలిగిన ప్రజా నాయకుడు వైయస్ జగన్ఉద్యమాన్ని ఎంత అణచాలని చూస్తే అంతకంటే ఎక్కువ పోరాడుతాంబంద్ను విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలుతిరుపతి: చంద్రబాబును చూస్తే హిట్లర్ కూడా సిగ్గుపడతాడని, చంద్రబాబు ఆధునిక కాలపు నియంత అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. చంటి పిల్లలను చంపి.. తల్లిని ఓదార్చే రకం చంద్రబాబు అని విరుచుకుపడ్డారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి గ్రామం నుంచి లక్షలాదిగా రోడ్ల మీదకు వచ్చి ప్రజలను అభ్యర్థిస్తూ బంద్‌ను విజయవంతం చేయడానికి అశేష కృషి చేసిన వైయస్‌ఆర్ సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమ కారుల మీద, ప్రజా నేతల మీద, సమస్యల కోసం నినదించే వారిపై తన కరాల నృత్య ఉక్కుపాదాలను మోపి ఎంత హీనంగా చంద్రబాబు నొక్కి వేస్తారో ఈ రోజు దాష్టికరూపం బయటపడిందన్నారు. చంద్రబాబు రాక్షసత్వానికి హోదా పోరులో వైయస్‌ఆర్ సీపీ కార్యకర్త కాకి దుర్గారావు ప్రాణాలొదిలారని, ఆయన మృతికి భూమన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నియంతలా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రజల ఆగ్రహజ్వాలలో మాడిమసికాక తప్పదని భూమన హెచ్చరించారు. చంద్రబాబు ప్రజల విశ్వాసాలను, ఆశయాలను ఉద్యమకారుల గొంతు నొక్కడం ద్వారా హోదాను సమాధి చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమాలను అణిచి అధికారంలో కొనసాగిన నియంతలెవరూ చరిత్రలో లేరన్నారు. చంద్రబాబు కూడా అందులో ఒకరిగా మిగిలిపోక తప్పదన్నారు. తనవాడు అనుకొని నమ్మి వెంట వచ్చిన వారిని సానికొంపకు పంపించే వ్యక్తిత్వం చంద్రబాబుదని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తున్న వైయస్‌ఆర్ సీపీ శ్రేణులను అత్యంత పైశాచికంగా అణచివేశారని దుయ్యబట్టారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకోవడం.. అనేక ఉద్యమాలు చేశానని తనకు తాను ప్రకటించుకునేవాడు.. తన కొడుకు లోకేష్ ద్వారా ట్వీట్లలో మా నాయన చేసిన పోరాటాలు ఇవని ప్రకటించుకునే చంద్రబాబు ప్రజల ఆశాజ్యోతులను ఆర్పే ప్రయత్నం చేయడం చూస్తుంటే ఎంత నీచపు మాట మాట్లాడిన తక్కువే అనిపిస్తుందన్నారు.
చంద్రబాబు చేస్తే దీక్షలట.. వైయస్‌ఆర్ సీపీ చేస్తే శిక్షలట. ఆయన చేస్తే ధర్మపోరాటాలు.. మేం చేస్తే ప్రజావ్యతిరేక ఉద్యమాలు అని ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబింపజేయడమే వైయస్‌ఆర్ సీపీ లక్ష్యమని, ప్రత్యేక హోదా కోసం ఎవరూ పోరాడినా.. వారికి మద్దతు ఇస్తాం.. కలుపుకొని పోతామని వైయస్ జగన్ అనేక సార్లు ప్రకటించారన్నారు. నాలుగేళ్ల పాటు వైయస్‌ఆర్ సీపీ వీరోచితమైన నాయకుడు వైయస్ జగన్ నేతృత్వంలో అనేక ఉద్యమాలు చేసిందన్నారు. మోడీ అన్యాయానికి వ్యతిరేకంగా మూడున్నర సంవత్సరాల క్రితమే.. పార్టీ నాయకులందరినీ రైళ్లలో ఢిల్లీకి తరలించి జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేయడమే కాకుండా.. పార్లమెంట్ ముట్టడించేందుకు వెళ్తూ వైయస్ జగన్ అరెస్టు కాబడ్డారన్నారని, ఇది చరిత్ర అన్నారు. ఇవాల్టికి ప్రత్యేక హోదా ప్రజలం గొంతుకల్లో రామనామ జపంలా పలుకుతుందంటే దానికి వైయస్ జగన్ కారణమన్నారు. హోదా కోసం యువజన సదస్సులు, దీక్షలు, ధర్నాలతో పాటు ఆమరణ దీక్షకు కూడా కూర్చున్న వ్యక్తి వైయస్ జగన్ అని గుర్తు చేశారు.
ఎన్ని అవమానాలు చేసినా.. ఎన్ని నిర్బంధాలకు గురిచేసినా చెక్కు చెదరని మనస్తత్వం కలిగిన గొప్ప నాయకుడు వైయస్ జగన్ అని భూమన అన్నారు. ఐదుకోట్ల మంది ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసం అనేక పోరాటాలు చేశారన్నారు. చంద్రబాబు జాతీయ పార్టీలన్నీ నా వెనుక పరిగెడుతున్నాయని పచ్చమీడియాలో రాయించుకొని హోదా వచ్చేసినట్లుగా ప్రచారం చేసినట్లుగా చెప్పించుకొని ఢిల్లీకి వెళ్లి వంగి వంగి దండాలు పెడుతున్నారన్నారు. పార్లమెంట్ సాక్షిగా దేశ హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చంద్రబాబుది.. బీజేపీది ఫెవికల్‌తో ముడిపెట్టిన బంధం అని చెప్పారన్నారు. అదే విధంగా ప్రధాని మోడీ చంద్రబాబును శ్రేయోభిలాషిగా భావిస్తూ వైయస్‌ఆర్ సీపీ ఉచ్చులో చిక్కుకుంటున్నావని హితవు చెప్పానని గుర్తు చేశారన్నారు. అంటే ఇంకా బీజేపీ, టీడీపీల లాలూచీ రాజకీయాలు కొనసాగుతున్నాయని బహిర్గతమైందన్నారు. బీజేపీతో బయటకు వచ్చానని ప్రజలను మభ్యపెడుతూ.. కేంద్రంతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుంటూ బీజేపీ, వైయస్‌ఆర్ సీపీకి పొత్తు అంటూ దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. వైయస్‌ఆర్ సీపీ ఎవరితో పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్తుందని వైయస్ జగన్ ప్రకటించారని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తే లక్షల మంది ఆందోళన కారులను పోలీసుల చేత అరెస్టులు చేయించిన దుర్మార్గపు ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదన్నారు.
పోలీసుల నిర్బంధంతో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందారని, హోదా కోసం ఆత్మత్యాగం చేశారని భూమన అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండల కృష్ణాపురం గ్రామానికి చెందిన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాకి దుర్గారావు దుర్మారణం చెందారన్నారు. ఆయన కుటుంబానికి భూమన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అదే విధంగా చిత్తూరు జిల్లాలో వైయస్‌ఆర్ సీపీ కార్యకర్తలను పోలీసులు ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించారని, అదే విధంగా నగరిలో ఒక ఎస్‌ఐ నిరసన తెలుపుతున్న కార్యకర్తలపై జులుం ప్రదర్శించాడని, తిరుపతిలో వైయస్‌ఆర్ సీపీ బీసీ సంఘం నాయకుడు బాబుమోహన్‌యాదవ్‌ను లాఠీలతో పొడిచారన్నారు. చంద్రబాబు నీలాంటి నియంతలు ఉద్యమాలను అణచాలని చూస్తే అంతకంటే ఎక్కువ ఉద్యమకారులుగా తీర్చిదిద్దే వ్యక్తిత్వం గల వ్యక్తి వైయస్ జగన్ అన్నారు.