నాలుగేళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు నాటకాలు


తిరుపతి: చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో నాలుగేళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు.  దమ్ముంటే తుని ఘటనపై చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధం కావాలని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌రెడ్డి సవాల్‌ విసిరారు. చంద్రబాబుది ధర్మ పోరాటం కాదని..దొంగ దీక్ష అని ఆయన అభివర్ణించారు. నాలుగేళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ జగన్‌ అలుపెరగని పోరాటం చేస్తుంటే..ఉద్యమకారులను అరెస్టు చేయించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. వంగవీటి రాధా, ఐఏఎస్‌ రాఘవేంద్రరావు హత్యల వెనుక చంద్రబాబు హస్తం ఉన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. వైయస్‌ రాజారెడ్డిని హతమార్చిన నిందితులను చంద్రబాబు తన ఇంట్లో 20 రోజులు ఉంచుకున్నది వాస్తవం కాదా అని నిలదీశారు. 
 
Back to Top