బాధితులు ఛీకొడుతున్నా.. బుద్ధిరాదా..?

సాయం అందించకుండా ప్రతిపక్ష నేతపై విమర్శలా..
చంద్రబాబుపై వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన ఫైర్‌..
శ్రీకాకుళంః తిత్లీ తుపాన్‌తో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. సాయం చేయాల్సిందిపోయి ప్రతిపక్ష నేతపై విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. సాయం అందలేదని బాధితులు మిమ్మల్ని నిలదీస్తే జనాలు జేజేలు కొడుతున్నారని ఎల్లోమీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారు. మంచినీళ్లు కూడా దొరకడం లేదని ఆందోళన చేస్తుంటే గూండాలుగా చిత్రీకరించడంతో బాధితులపై మీకున్న చిన్నచూపు అర్థంమవుతోందన్నారు. హెరిటేజ్‌ కంపెనీ ద్వారా కలుషిత నీరు సరాఫరా చేస్తున్నారన్నారు. పాల ప్యాకెట్లులో నీళ్లు వస్తున్నాయన్న బాధితుల ఘోష వినపడలేదా అని ప్రశ్నించారు. అపార నష్టం జరిగి ప్రజలు రోడ్డున పడితే వారిని ఆదుకోకుండా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. సాయం బాధితులు చంద్రబాబుని ఛీకొడుతున్నా హోర్టింగ్‌లు పెట్టుకులు బాధితులు తమను అభినందిస్తున్నారంటూ సిగ్గుమాలిన ప్రచారం చేసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైయస్‌ జగన్‌ తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం లేదని చంద్రబాబు విమర్శలను తప్పుబట్టారు.

అధికారంలో ఉన్నది..మీరు అని, బాధితులకు సాయం అందించడం కోసం వైయస్‌ జగన్‌ రెండు హైపవర్‌ కమిటీలు వేసి తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సాయం అందిస్తున్నారన్నారు. అలాగే వైయస్‌ఆర్‌సీపీ నుంచి కోటి రూపాయలు సాయం కూడా ప్రకటించారన్నారు.ఇంత చేస్తున్నా పనిగట్టుకుని ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారన్నారు.10,15 రోజులలో తుపాన్‌ ప్రభావిత ప్రాంతాలో జగన్‌ పర్యటిస్తారన్నారు. ఆ రోజున చంద్రబాబు నిర్వాకాన్ని ప్రజలకు జగన్‌ వివరిస్తారన్నారు. చంద్రబాబును ప్రశ్నించిన బాధితులపై కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారన్నారు.అధికారుల చేత పనిచేయించకుండా చంద్రబాబు తన రాజకీయాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు.పక్క రాష్ట్రం ఒరిస్సాలో బాధితులకు అందుతున్న సాయంలో పదోవంతు కూడా శ్రీకాకుళం బాధితులకు అందడంలేదన్నారు.పక్క రాష్ట్రాన్ని చూసి ముఖ్యమంత్రి బుద్ధితెచ్చుకోవాలన్నారు. 

Back to Top