<strong>ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే పవన్ పర్యటన</strong><strong>వైయస్‌ఆర్‌సీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి</strong>అనంతపురంః పవన్‌కల్యాణ్..చంద్రబాబు ఆయుధం అని వైయస్‌ఆర్‌సీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు.రైతు ఆత్మహత్యలు,వలసలపై చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.కష్టాల్లో ఉన్న అన్నదాతలను పరామర్శించిన సంగతి పవన్ తెలియదా అని అన్నారు.వైయస్ జగన్‌ను విమర్శించేందుకే కవాతు నిర్వహించారా అని మండిపడ్డారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే పవన్ పర్యటన అని అన్నారు.తరిమెల నాగిరెడ్డి బాటలో వెళ్లాలన్న పవన్‌కల్యాణ్ గత ఎన్నికల్లో బీజేపీ సిద్ధాంతాలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు.తరిమెల స్ఫూర్తికి భిన్నంగా పవన్ వ్యవహరిస్తున్నారన్నారు. <br/>