వైయ‌స్‌ జగన్‌ నిర్ణయం చారిత్రాత్మకంబీసీలను మభ్యపెట్టడానికి కత్తెరలు, ఇస్త్రీ పెట్టెలు పంపిణీ 
వైయ‌స్ఆర్‌సీపీతోనే బీసీలకు రాజ్యాధికారం 
రాజమహేంద్రవరం పార్లమెంటరీ కో ఆర్డినేటర్‌ భరత్‌
టీడీపీ బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటోంది 

తూర్పుగోదావరి :  రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు రాజ్యాధికారం కల్పించాలన్న లక్ష్యంతో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని, అందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర సమయంలో రాజమహేంద్రవరం పార్లమెంట్‌ సీటు నుంచి బీసీలపు పోటీ చేయిస్తానని చెప్పారని రాజమహేంద్రవరం పార్లమెంటరీ కో ఆర్డినేటర్‌ భరత్ అన్నారు. బీసీలకు రాజ్యాధికారం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమవుతుందని భరోసా కలగడంతో తన తండ్రి మార్గాని నాగేశ్వరరావుతో పాటు వైయ‌స్ఆర్‌ సీపీలో చేరామని పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ కో ఆర్డినేటర్‌ మార్గాని భరత్‌ అన్నారు. బీసీ సంఘం రాష్ట్ర నేతగా ఉన్న తన తండ్రి 25 ఏళ్లపాటు టీడీపీలో కొనసాగారన్నారు. ప్రస్తుత టీడీపీ నాయకత్వం బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తోంది తప్పా రాజ్యాధికారం కల్పించాలన్న ఆలోచన లేదన్నారు. రాజమహేంద్రవరంలోని మార్గాని ఎస్టేట్‌లో పార్టీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోష్, కో ఆర్డినేటర్లు జక్కంపూడి విజయలక్ష్మి, రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల వీర్రాజు, యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, తన తండ్రి, బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు తదితరులతో కలిసి శుక్రవారం భరత్‌ విలేకర్లతో మాట్లాడారు. వైయ‌స్ఆర్‌సీపీ  నిర్ణయాల నేపథ్యంలోనే బీసీలను మభ్యపెట్టడానికి కత్తెరలు, ఇస్త్రీ పెట్టెలు పంపిణీ చేస్తున్నారని అధికార పార్టీపై మండిపడ్డారు. 72 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో మొదటిసారి రాజమహేంద్రవరం ఎంపీ సీటును బీసీలకు కేటాయించ డం అభినందనీయమన్నారు. తనను పార్లమెంట రీ కో ఆర్డినేటర్‌గా నియమించి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన కుటుంబంపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో పార్లమెంట్‌తోపాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని స్పష్టం చేశారు. అందరినీ కలుపుకుని పార్టీని మరింత బలోపేతం చేసేం దుకు అన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

పెద్దల సలహాలు తీసుకోండి
రాజమహేంద్రవరం పార్లమెంట్‌ ఎన్నికలకు సీనియర్‌ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సలహాలు తీసుకొని, గెలుపే లక్ష్యంగా సీనియర్‌ నేత జక్కంపూడి విజయలక్ష్మి, ఇతర నేతలతో రాజకీయ వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని భరత్‌కు ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ సూచించారు. బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం మార్గాని భరత్‌ను కో ఆర్డినేటర్‌గా వైఎస్‌ జగన్‌ నియమించడం శుభపరిణామమని, తామందరం కలసి పార్టీ విజయానికి కృషి చేస్తామని సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. మార్గాని కుటుంబం రాజమహేంద్రవరం రూరల్‌ నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తుందంటూ ఎన్నో ఏళ్లుగా వింటున్నామని, కానీ ఆ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న విషయం మార్గాని నాగేశ్వరరావుకు అర్థమైవైయ‌స్ఆర్‌ సీపీ లో చేరారని మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. పరస్పర సహకారంతో తామంతా కలసి పని చేస్తామని రాజమహేంద్రవరం రూరల్‌ కో ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు అన్నారు. రానున్న ఆరు నెలలు తామంతా మరింత ఉత్సాహంగా పని చేసి, వైఎస్‌ జగన్‌ను సీఎం చేస్తామని యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. ఏడు అసెంబ్లీ, ఎంపీ సీటు గెలిచేలా బీసీలంతా కలసికట్టుగా పార్టీ కోసం పని చేస్తామని పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కవురు శ్రీనివాస్‌ పేర్కొన్నారు. నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ వివిధ విభాగాల నేతల కానుబోయిన సాగర్, నరవ గోపాల కృష్ణ, మార్గాని చంటి, సంకిస భవాని ప్రియ పాల్గొన్నారు.


Back to Top