నంద్యాలలో వైయస్సార్సీపీ జెండా ఎగరవేస్తాం

  • ఫరూక్ విషప్రచారం మానుకో
  • ప్రజల ఆశీర్వాదం వైయస్సార్సీపీకి ఉంది
  • వైయస్ జగన్ ఇమేజ్ తో గెలిచి తీరుతాం
  • వైయస్సార్సీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి
కర్నూలుః నంద్యాల ఉపఎన్నికల్లో వైయస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయమని వైయస్సార్సీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి తెలిపారు. అధికార టీడీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైయస్ జగన్ ఇమేజ్, ప్రజల ఆశీర్వాదంతో నంద్యాలలో వైయస్సార్సీపీ గెలిచి తీరుతామన్నారు. టీడీపీ నేత ఫరూక్ లేనిది ఉన్నట్టు చెబుతూ విషప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. అసత్య ప్రచారం కట్టిబెట్టాలని హితవు పలికారు. ముస్లిం సోదరులు తనపై ఎంత ఆత్మీయంగా ఉన్నారో అందరికీ తెలుసునన్నారు.సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీని వీడి వైయస్సార్సీపీలోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇద్దరం ఆ పార్టీలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు.  అయినా కూడ ఎప్పుడూ బాబు, లోకేష్ గురించి మాట్లాడలేదన్నారు. భూమా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సహించామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ కుటుంబంపై అమితమైన గౌరవం, జగన్ పై అభిమానం ఉండడం వల్లే తాము వైయస్సార్సీపీలో రావడం జరిగిందన్నారు. 

వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే నంద్యాల రూపురేఖలే మారుతాయని శిల్పా మోహన్ రెడ్డి అన్నారు .  రూ. 1200కోట్లు ఇచ్చామని ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందన్నారు. జీవోలు మాత్రమే ఇచ్చారు తప్ప ఇంతవరకు పనులు మొదలుకాలేదన్నారు.  అప్లికేషన్లే 1120 వస్తే 13వేల ఇళ్లు ఇచ్చామని చెప్పడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమృత పథకం కింద ఎప్పుడో శాంక్షన్ అయిన కేంద్ర పథకం వాటర్ స్కీంను కూడ  బాబు తమ ఖాథాలో జమ చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. దీపకుంటకు వచ్చినప్పుడు నిధులు అడిగితే ఎక్కడి నుంచి తీసుకురావాలంటూ చంద్రబాబు తనపై కోప్పడ్డారని భూమా గుర్తు చేశారు.  ముస్లిం సోదరులు తనపై ఎంత ఆత్మీయంగా ఉన్నారో అందరికీ తెలుసునన్నారు.  శిల్పా చక్రపాణిరెడ్డి వైయస్సార్సీపీలోకి వచ్చిన పరిస్థితుల్లో కర్నూలులో పార్టీ నూటికి నూరుపాలు బలోపేతం అవుతుంన్నారు. జిల్లాలో అన్ని సాధించి వైయస్సార్సీ జెండా ఎగరవేస్తామన్నారు. 

తాజా వీడియోలు

Back to Top