మహానేత ఆశయ సాధనే ధ్యేయం

హైదరాబాద్‌:  దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాల కొనసాగింపు కోసమే వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భవించిందని పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. మహానేత ఆశయ సాధనే వైయస్‌ జగన్‌ ధ్యేయమని చెప్పారు. వైయస్‌ఆర్‌సీపీ 8వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో భూమన మీడియాతో మాట్లాడారు. పోరాటాల పార్టీగా ప్రజలందరి హృదయాల్లో వైయస్‌ఆర్‌సీపీ చిరస్మరణీయంగా నిలిచిపోయిందని తెలిపారు. సుమున్నతమైన విలువలతో కూడిన వైయస్‌ఆర్‌సీపీ ప్రజల ఆశీర్వద బలంతో ఎదుగుతూ వచ్చిందన్నారు. 
 
Back to Top