హామీల అమలు సాధించేవరకు అలుపెరుగని పోరాటం




- పార్ల‌మెంట్ ప్రాంగ‌ణంలో వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎంపీల ధ‌ర్నా
- ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలంటూ రాజ్య‌స‌భ స‌భ్యుల నినాదాలు

 న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలు సాధించేవరకు అలుపెరుగని పోరాటం చేస్తామని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీలు, రాజ్య‌స‌భ స‌భ్యులు స్పష్టం చేశారు.ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా ఇవాళ‌ పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వర ప్రసాద్‌, వైవీ సుబ్బారెడ్డి, రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి, వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు ధర్నా చేస్తున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని ఫ్ల‌కార్డులు ప‌ట్టుకొని నిన‌దిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు మాట్లాడుతూ..   ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పదవులకు రాజీనామా చేశామని, ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి పోరాటం చేశామని పేర్కొన్నారు. గతంలో తమ పార్టీ అవిశ్వాసం పెడితే ఏపీ సీఎం చంద్రబాబు నాయడు హేళన చేశారని.. ఆరోజే టీడీపీ ఎంపీలు మాతో కలిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని వారు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు రోజుకో డ్రామా ఆడుతున్నారని, అవిశ్వాసం పెట్టే నైతిక హక్కు టీడీపీకి లేదని మండిపడ్డారు. ఇదంతా టీడీపీ- బీజేపీల మ్యాచ్‌ ఫిక్సంగ్‌లో భాగంగానే ఈ డ్రామా జరుగుతోందని ఆరోపించారు. 


Back to Top