వెలిగొండ ప్రాజెక్టు కోసం వైవీ సుబ్బారెడ్డి పాద‌యాత్ర‌

 
 ప్రకాశం : వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండ‌టంతో  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌య్యారు. ఈ మేర‌కు ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.  ప్రభుత్వ తీరుకు నిరసనగా పాదయాత్ర చేయనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. పాదయాత్ర రూట్‌మ్యాప్‌ను వైయ‌స్ఆర్‌సీపీ నేతలు సమావేశమై ఖరారు చేశారు. ఈ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి, మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి,   నేత సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. 

Back to Top