ఏర్పేడు బాధితుల‌కు వైయ‌స్ఆర్ సీపీ ఆర్థిక స‌హాయం

ఒక్కో కుటుంబానికి రూ. 50 వేలు అంద‌జేత‌
చిత్తూరు: ఏర్పేడు ప్రమాద బాధిత కుటుంబాలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆర్థిక సహాయం అందజేసి వారికి అండగా నిలిచింది. వైయస్‌ఆర్‌ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బియ్యపు మధుసూదన్‌రెడ్డి బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 50 వేల చొప్పున మొత్తం 16 కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు. బాధితులకు వైయస్‌ఆర్‌ సీపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. గల్ఫ్‌ స్టేట్‌ చెరలో ఉన్న ఏర్పేడు మృతుడు జైచంద్ర భార్య రేణుకను తక్షణమే రప్పించాలని మధుసూదన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 
Back to Top