<strong>అమరావతిః</strong> లింగాయపాలెంలో అసైన్డ్‌భూముల రైతుల ఆమరణ దీక్షకు వైయస్‌ఆర్‌సీపీ సంఘీభావం ప్రకటించింది.రాజధాని పేరుతో రైతుల భూములు తీసుకుని ఏం చేశారని వైయస్‌ఆర్‌సీపీ నేతలు ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వం రాజధాని పేరుతో దళితులకు అన్యాయం చేస్తుందన్నారు. భూమిలిచ్చిన రైతులకు ఇప్పటివరుకు ఏం చేశారో చెప్పాలన్నారు. అసైన్డ్‌భూముల రైతులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందన్నారు. వైయస్ జగన్ సీఎం కాగానే రైతులకు న్యాయం చేస్తామన్నారు. అసైన్డ్ భూములకు ఎంజాయ్‌మెంట్ సర్వే చేయాలని డిమాండ్ చేసారు. మూడేళ్లుగా అధికారులు పట్టించుకోవడంలేదన్నారు.