చంద్రబాబు అబద్ధాలు చెల్లవు

న్యూఢిల్లీ: చంద్రబాబు అబద్ధాలు చెల్లవని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. అందుకే తెలంగాణలో ప్రజలు చంద్రబాబును ఓడించారని గుర్తు చేశారు.  అవినీతిలో చంద్రబాబుదే నంబర్‌ వన్‌ స్థానమన్నారు. పేదలకు పంచే నిధులను జన్మభూమి కమిటీ సభ్యులు మింగేస్తున్నారన్నారు. కేంద్ర పథకాలు కూడా ఏపీలో పక్కదోవ పడుతున్నాయన్నారు. చంద్రబాబుకు తెలంగాణ ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారో అదే విధంగా ఏపీలో కూడా చంద్రబాబును తిరస్కరించాలని కోరారు. చంద్రబాబుకు చివరి రాజకీయ ఘడియలు వచ్చాయన్నారు. రాజకీయాలు వదిలి పోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. గ్రాఫ్‌ పడుతుందనే మోడీని చంద్రబాబు విడిచిపెట్టారని విమర్శించారు. అందుకే కాంగ్రెస్‌తో చంద్రబాబు దోస్తీ కట్టారన్నారు. 
 
Back to Top