మ‌హిళ‌ల‌కు అండ‌గా ఉంటా

తిరుపతి రూరల్‌ : మ‌హిళ‌ల సంక్షేమ‌మే త‌న ధ్యేయ‌మ‌ని, వారికి ఎప్పుడూ అండ‌గా ఉంటాన‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి అన్నారు.  రక్షబంధన్‌ సందర్భంగా చంద్రగిరి ఎంపీపీ కార్యాలయంలో మ‌హిళా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే చెవిరెడ్డికి రాఖీలు కట్టారు. నుదుటన తిలకం దిద్ది చల్లంగా ఉండాలని ఆకాంక్షించారు. స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా వారందరికి ఎమ్మెల్యే నూతన వస్త్రాలను, స్వీట్లును బహుకరించారు. ఈ సందర్భగా ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ మహిళలు ఎక్కడైతే సుఖసంతోషాలతో ఉంటారో, అక్కడ ఆనందాలు వెల్లువిరుస్తాయని పేర్కొన్నారు. ఆడపడుచుల మెహాల్లో సంతోషాలు చూడాలనే పార్టీలకు అతీతంగా ప్రతి ఏటా రాఖీ పండుగ నాడు సోదరుడుగా నూతన వస్త్రాలను, స్వీట్లను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుసుమకుమారి, సర్పంచ్‌లు పాదిరి ఉమామహేశ్వరీ, పద్మజ, ఎంపీటీసీలు, పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, మస్తాన్, యుగంధర్‌రెడ్డి, సీఎం కేశవులు పాల్గొన్నారు.
Back to Top