తండ్రి ఆశయాలను పంచుకున్న నాయకుడు

హైదరాబాద్ః
వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ 43 జన్మదిన వేడుకలను తెలంగాణ
వైఎస్సార్సీపీ నేతలు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున నిర్వహించారు. కేక్ కట్
చేసి వైఎస్ జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దివంగత
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలు సాధించేదిశగా ప్రజాసమస్యలపై
వైఎస్ జగన్ ఎనలేని పోరాటం చేస్తున్నారని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
అన్నారు.  వైఎస్ జగన్ కు  అష్ట ఐశ్వర్యాలతో పాటు ఆయుర్ ఆరోగ్యాలు ఆదేవుడు
ప్రసాదించాలని...ఏపీతో పాటు తెలంగాణ ప్రజల కోరికలు నెరవేర్చే విధంగా
దీవెనలు ఇవ్వాలని ఆకాంక్షించారు. 

చల్లా మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు నాయకులు రక్తదానం చేశారు. ఏ
ముఖ్యమంత్రుల కొడుకులైనా సంపదను పంచుకుంటారని... కానీ,  తండ్రి ఆశయాలను
పంచుకున్నఏకైక నాయకుడు వైఎస్ జగన్ అని నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. 
Back to Top