వైయస్సార్‌ సీపీ బూత్‌ కమిటీ కన్వీనర్ల సమావేశం

గుత్తి: పట్టణంలోని కర్నూల్‌ రోడ్డులో శాంతి ప్రియ ఆసుపత్రి వద్ద ఉన్న ఇలాహి షాదీ ఖానాలో ఆదివారం గుంతకల్లు సమన్వయ కర్త వై. వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్‌ సీపీ బూత్‌ కమిటీ కన్వీనర్ల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పట్టణ, మండల కన్వీనర్లు పీరా, గోవర్దన్‌రెడ్డిలు శనివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. పట్టణ, మండల బూత్‌ కమిటీ కన్వీనర్లు తప్పకుండా సమావేశానికి హాజరు కావాలని వారు కోరారు.

Back to Top