వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్లే అత్యాచారాలు

గుంటూరు: చంద్రబాబు వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్లే మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి ధ్వజమెత్తారు. దాచేపల్లిలో బాలికపై అత్యాచారం జరిగితే ముఖ్యమంత్రి స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు. నాలుగేళ్లుగా మహిళలపై దాడులు విపరీతంగా పెరిగాయన్నారు. టీడీపీ చట్టాలను చేతిలోకి తీసుకొని సెటిల్‌మెంట్‌లు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. దాచేపల్లిలో బాలికపై జరిగిన అత్యాచారానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top