వైయ‌స్‌ఆర్‌సీపీ సలహాదారు డీఏ సోమయాజులు కన్నూమూత

హైద‌రాబాద్‌: వైయ‌స్ఆర్ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు ఆదివారం తెల్లవారుజామున 3.14 గంటలకు స్వర్గస్థులయ్యారు. గత కొంత కాలంగా డీఏ సోమయాజులు శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. 1953లో ఉమ్మడి మహాబూబ్‌ నగర్‌ జిల్లా గద్వాల్‌లో సోమయాజులు జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మొట్టమొదటి ఇండస్ట్రియల్‌ డెవలప్మెంట్‌ కార్వొరేషన్‌కు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. సోమయాజులు గతంలో దివంగత ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ రాజశేఖర రెడ్డి హయాంలో ఆర్థిక సలహాదారుగా పని చేశారు. అగ్రికల్చర్‌ టెక్నాలజీ డిప్యూటీ ఛైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరించారు.
Back to Top