29 మందితో వైఎస్సార్ సిఎల్పీ కార్యవర్గం

హైదరాబాద్, జూన్ 18: ఇరవై తొమ్మిది మంది సభ్యులతో వైఎస్సార్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (శాసన సభాపక్షం) కార్యవర్గం రూపుదిద్దుకున్నది. పార్టీ అధ్యక్షులు, శాసన సభాపక్ష నేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన వైఎస్సార్ సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన అనంతరం ఆరుగురు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, అయిదుగురు కార్యదర్శులతో కార్యవర్గాన్ని నియమించారు. అందరి ఆమోదం అనంతరం శ్రీ జగన్ స్వయంగా ఈ పేర్లను చదివి వినిపించారు.

వైఎస్సార్ సీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, జ్యోతుల నెహ్రూ, కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, రాజన్న దొర, బూడి ముత్యాలనాయుడు, కార్యదర్శులుగా సుజయ్ కృష్ణ రంగారావు, జలీల్ ఖాన్, నారాయణ స్వామి, కాకాణి గోవర్ధన రెడ్డి, ఆర్కే రోజా, విప్ గా ఎన్ అమరనాథ్ రెడ్డి, కోశాధికారులుగా కోన రఘుపతి, అత్తారు చాంద్ బాషా నియమితులయ్యారు.

కార్యవర్గ సభ్యులుగా పి.అనిల్ కుమార్ యాదవ్, కంబాల జోగులు, గౌరు చరితా రెడ్డి, ముస్తఫా, పోతుల రామారావు, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, దాడిశెట్టి రాజా, కిడారి సర్వేశ్వరరావు కలమట వెంకట రమణ, వై.విశ్వేశ్వర రెడ్డిని నియమించారు. సమన్వయకర్తలుగా గడికోట శ్రీకాంత్ రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, ఆదిమూలం సురేష్ నియమితులయ్యారు. శాసన సభాపక్షం అధికార ప్రతినిధులుగా జ్యోతుల నెహ్రూ, గడికోట శ్రీకాంత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆర్కే రోజాలను నియమించారు.

పార్టీ సమన్వయకర్తలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసన సభాపక్షాన్ని సమన్వయపరచడానికి పార్టీకి చెందిన అయిదుగురు నేతలతో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ సీనియర్ నేతలు ఎంవీ మైసూరా రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తమ్మినేని సీతారాం, అంబటి రాంబాబు ఈ కమిటీలో ఉన్నారు.

Back to Top