ప్రియతమ నేత వర్థంతి కార్యక్రమాలు

రాజకీయాల్లో సరికొత్త ఒరవడిని సృష్టించి..తెలుగు ప్రజల గుండెల్లో
చెరగని ముద్ర వేసుకున్న మహనీయుడు. ప్రతి అక్క ప్రతి చెల్లి, అవ్వతాత,
అన్నాతమ్ముడు అందరూ కొలిచే దేవుడు. ఆరోగ్యప్రదాత, అన్నాదతల కల్పతరువు, పేదల
దివ్యదాత ఇలా ఎన్ని చెప్పినా తక్కువే. ఆయనే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా
నిలిచిన మహానేత ...తెలుగు ప్రజలు ఎప్పటికీ మరచిపోని మహనీయుడు  దివంగత
ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి.

ప్రియతమ
నేత  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరవ వర్థంతి కార్యక్రమాన్ని రేపు ఉదయం 7.30
గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో  నిర్వహించనున్నట్టు ఎంపీ మేకపాటి
రాజమోహన్ రెడ్డి తెలిపారు. ఆతర్వాత పంజాగుట్ట సెంటర్ లోని వైఎస్
విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. తదనంతరం పార్టీ ఎమ్మెల్యేలు,
ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళతారని రాజమోహన్ రెడ్డి ప్రకటించారు.
Back to Top