పేద ముస్లింలను ఆదుకున్నది వైయస్సారే

నరసరావుపేట : రాష్ట్రంలో పేద ముస్లింలను ఆదుకున్న నిజమైన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.  షాదీఖానా ప్రాంగణంలో రంజాన్‌ పర్వదినం సందర్భంగా పట్టణంలోని 27 మసీదుల్లో పనిచేసే పేష్‌మామ్, మౌజుమ్‌లకు నూతన దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుత ప్రభుత్వం పేష్‌మామ్, మౌజుమ్‌లకు నెలకు రూ.5 వేలు, రూ.3 వేలు ఇస్తామని ప్రకటించినా ఇప్పటివరకు ఏ కొద్దిమందికి తప్పితే అమలు చేయలేదన్నారు. ముస్లింలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి తెలుగుదేశం ప్రభుత్వానికి లేదన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా ముస్లింలకు రిజర్వేషన్‌ కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. వైయస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే పేష్‌మామ్, మౌజుమ్‌లకు నెలకు రూ.7 వేలు, రూ.5 వేలు తప్పకుండా చెల్లిస్తుందన్నారు. పార్టీ అధ్యక్షుడు వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఎన్నికల మేనిఫెస్టోలో తప్పకుండా ఈ అంశాన్ని పొందుపరుస్తామన్నారు. కార్యక్రమంలో వైయస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్సి మిట్టపల్లి రమేష్, పట్టణ అధ్యక్షుడు ఎస్‌.ఎ.హనీఫ్, జిల్లా కార్యదర్శి షేక్‌.ఖాదర్‌బాషా, జిల్లా అధికార ప్రతినిధి పిల్లి ఓబుల్‌రెడ్డి, కౌన్సిలర్లు షేక్‌ రెహమాన్, కారుమంచి మీరావలి, లాం సోమయ్య, మాడిశెట్టి మోహనరావు, మాజీ కౌన్సిలర్‌ షేక్‌ మంజూర్, మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ ఖాదర్‌భాషా, సయ్యద్‌ మున్నీ, పొదిలే ఖాజా, నబీసుభాని, శ్యామల శ్రీనివాసరెడ్డి, మూరే రవీంద్ర, ఎన్‌కే. ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top