మహానేతకు నివాళులర్పించిన విజయమ్మ

ఇడుపులపాయ 08 జూలై 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన  కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. వైయస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలోని సమాధిస్థలి దగ్గర అంజలి ఘటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి వైయస్‌ భారతి, వైయస్‌ కొండారెడ్డి తదితరులు ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌కు వెళ్ళి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఉదయం 8.30 గంటలకు కడప పట్టణంలోని ప్రధాన తపాల కార్యాలయం వద్ద వైయస్ఆర్  విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పుష్పాలతో అలంకరించారు. అనంతరం కడప నియోజకవర్గ సమన్వయకర్త ఎస్‌బీ అంజాద్‌బాష ఆధ్వర్యంలో అన్నదానం చేస్తారు. 9 గంటలకు వైయస్ఆర్ విగ్రహం వద్ద సేవాదళం విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. తదుపరి, మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో అల్‌షిఫా మానసిక వికలాంగుల కేంద్రంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేస్తారు. ఎస్టీ విభాగం ఆధ్వర్యంలో పద్మ మానసిక పునరావాస కేంద్రంలో రోగులకు దుప్పట్లను అందిస్తారు. నగర మహిళా విభాగం ఆధ్వర్యంలో రాస్ స్వచ్ఛంధ సంస్థలో పండ్లు అందజేస్తారు. శంకరాపురంలోని అంధుల పాఠశాలలో వైయస్ఆర్ కాంగ్రెస్ కువైట్ కమిటీ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీచేస్తారు. అమ్మ ఒడిలో జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో పుస్తకాలను అందిస్తారు. రిమ్సు ఆస్పత్రిలో వైయస్ఆర్ టీయూసీ ఆధ్వర్యంలో పండ్లు, రొట్టెలు అందజేస్తారు. సాయిబాబా అనాథ శరణాలయంలో ఎస్సీ విభాగం అన్నదానం చేస్తుంది. ఆర్తీహోంలో నగర యువజన విభాగం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపడతారు. అంధుల పాఠశాలలో రాష్ట్ర యువజన విభాగం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు.

Back to Top