బాబు ధ్యాసంతా దోచుకోవాలి..దాచుకోవాలి!


విజయవాడ: దోచుకోవాలి..దాచుకోవాలన్నదే చంద్రబాబు ధ్యాస అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  విమర్శించారు. భయపెట్టి, బెదిరించి, కేసులు పెట్టి 33 వేల ఎకరాలు సేకరించారని, రాజధాని భూముల్లో ఇప్పటికీ ఒక్క శాశ్వత కట్టడం లేదని విమర్శించారు. నాలుగున్నరేళ్ల పాలనలో కలెక్టర్ల వ్యవస్థను దళారీ వ్యవస్థగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. జీవో నంబర్‌ 562ను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండు చేశారు.
 
Back to Top