26న సమైక్య శంఖారావం

హైదరాబాద్17అక్టోబర్2013: అక్టోబర్ 26న సమైక్య శంఖారావం సభను  నిర్వహించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సమైక్య రాష్ట్రం డిమాండ్‌తో మొదట ఈ నెల 19నే హైదరాబాద్‌లో సభ నిర్వహించాలనుకున్నా.. ప్రభుత్వం అనుమతించలేదు. దాంతో వైఎస్సార్‌సీపీ హైకోర్టును ఆశ్రయించింది. సభ నిర్వహణకు బుధవారం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, 19వ తేదీ మరో రెండు రోజులే ఉండటంతో సమైక్య శంఖారావం సభను ఈ నెల 26వ తేదీకి పార్టీ వాయిదా వేసింది. ఆ మేరకు సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు కె.శివకుమార్ బుధవారం నగర డీసీపీ కమలాసన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

Back to Top