తెలుగు ప్రజల ఆరాధ్యదైవం వైయస్‌ఆర్‌

నెల్లూరు రూరల్‌: పేద ప్రజల మంచి కోసం పనిచేసిన దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆరాధ్యదైవంగా మారరని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని కరెంటు ఆఫీసు సెంటర్‌లో గల మహానేత వైయస్‌ రాజశేఖరెడ్డి విగ్రహానికి ఎంపీ మేకపాటి, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేయాలనే ఆలోచన ఉంటే ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టవొచ్చో వైయస్‌ఆర్‌ చేసి చూపించారన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి అభివృద్ధే లక్ష్యంగా పనిచేశారన్నారు. మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఇచ్చిన మాట కోసం జీవితకాలం పనిచేసిన మహానుభావుడు అని కొనియాడారు. రాజన్నకు గుర్తుకు వైయస్‌ జగన్‌ అన్నకు తోడుగా రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజలు ఆశీస్సులు అందించాలని కోరారు. 2019లో వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందన్నారు. 

Back to Top