మ‌హానేత కుటుంబంపై క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లు- వైయ‌స్‌ రాజారెడ్డి హంతకుడి విడుదల
 
 - రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే విడుదల

  అమరావతి : దివంగత సీఎం వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబంపై చంద్ర‌బాబు క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లు కొన‌సాగిస్తున్నారు. వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మ‌ర‌ణాంత‌రం చంద్ర‌బాబు కాంగ్రెస్‌తో చేతులు క‌లిసి ఆయ‌న కుటుంబాన్ని తీవ్రంగా వేధించారు. తాజాగా వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి తండ్రి వైయ‌స్‌ రాజారెడ్డి హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న రాగిపిండి సుధాకర్‌రెడ్డిని క్షమాభిక్ష పేరిట రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాజకీయ ఒత్తిళ్ల వల్లే వైయ‌స్‌ రాజారెడ్డి హత్యకేసులో నిందితుడైన రాగిపిండి సుధాకర్‌రెడ్డిని విడుదల చేశారు. వైయ‌స్ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం వేల్పుల గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డి 1998లో జరిగిన వైయ‌స్‌ రాజారెడ్డి హత్యకేసులో నిందితుడు. ఈ హత్యకేసులోని నిందితులందరికీ న్యాయస్థానం 2006లో జీవిత ఖైదు విధించింది. అప్పట్నుంచి నెల్లూరు జిల్లాలోని కారాగారంలో జైలు జీవితం గడుపుతున్న సుధాకర్‌రెడ్డిని విడుదల చేయాలంటూ టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. Back to Top